కేంద్ర సంస్కరణలు అమలు చేస్తే రుణం ఇస్తామనడం ప్యాకేజి అవుతుందా?: సీఎం కేసీఆర్

18-05-2020 Mon 21:31
  • మోసపూరిత ప్యాకేజి అంటూ విమర్శలు
  • అంకెల గారడీ అని అంతర్జాతీయ మీడియా చెబుతోందని వ్యాఖ్యలు
  • రాష్ట్రాలను బిచ్చగాళ్లను చేస్తారా? అంటూ ఆగ్రహం
CM KCR fires on Centre and slammed package

ప్రధాని నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్లతో ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ ప్యాకేజిపై తెలంగాణ సీఎం కేసీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. కేంద్ర సంస్కరణలు అమలు చేస్తే రుణం ఇస్తామనడం ప్యాకేజి అవుతుందా అంటూ ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పట్ల దారుణంగా వ్యవహరిస్తోందని, ఆర్థికంగా దిగజారిన వేళ రాష్ట్రాలను భిక్షగాళ్లను చేస్తున్నారని విమర్శించారు. ఎఫ్ఆర్ బీఎం పరిమితి పెంచుతూ ఆంక్షలు విధించడం నియంతృత్వం కాదా? అని నిలదీశారు. కేంద్రం ప్రకటించిన ప్యాకేజి అంకెల గారడీ అని అంతర్జాతీయ మీడియా సంస్థలే చెబుతున్నాయని, కేంద్ర ప్యాకేజి మోసపూరితం అని వ్యాఖ్యానించారు.