నా భార్య హీరోయిన్ అయితేనే ఆ సినిమాలో నటిస్తా: కోహ్లీ

18-05-2020 Mon 20:50
  • బాలీవుడ్ లో క్రికెటర్ల బయోపిక్ ల హవా
  • కోహ్లీ బయోపిక్ పై ఆసక్తి చూపుతున్న దర్శక, నిర్మాతలు 
  • నా బయోపిక్ లో నేనే హీరోగా నటిస్తానంటూ కోహ్లీ సరదా వ్యాఖ్య
I play hero role in my biopic says Kohli

ఇప్పటికే పలువురు క్రికెటర్ల జీవిత చరిత్రలతో బాలీవుడ్ లో బయోపిక్ లు తెరకెక్కాయి. సచిన్, ధోనీ, అజారుద్దీన్ బయోపిక్ లు విడుదలై ప్రేక్షకాదరణ పొందాయి. కపిల్ దేవ్ చరిత్రతో తెరకెక్కిన చిత్రం విడుదల కావాల్సి ఉంది. లాక్ డౌన్ నేపథ్యంలో ఈ చిత్రం విడుదల ఆగింది. మరోవైపు, టీమిండియా కెప్టెన్ కోహ్లీ చరిత్రను తెరకెక్కించేందుకు బాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు సిద్ధంగా ఉన్నారు. ఒక సినిమాకు అవసరమైన ఆసక్తికర అంశాలన్నీ కోహ్లీ జీవితంలో ఉండటమే దీనికి కారణం. ఈ నేపథ్యంలో, తన బయోపిక్ పై కోహ్లీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ట్విట్టర్ లైవ్ చాట్ లో కోహ్లీ మాట్లాడుతూ, తన బయోపిక్ నిర్మిస్తే... తానే  హీరోగా ఉంటానని కోహ్లీ చెప్పాడు. తన భార్య అనుష్క శర్మ హీరోయిన్ గా ఉంటేనే తాను నటిస్తానని కండిషన్ కూడా పెట్టాడు. మరి కోహ్లీ కండిషన్లకు ఒప్పుకుని ఏ నిర్మాత, దర్శకుడు అవకాశాన్ని దక్కించుకుంటాడో వేచి చూడాలి.