Doctor Sudhakar: డాక్టర్ సుధాకర్ అరెస్ట్ పై హైకోర్టులో పిటిషన్

PIL filed in AP High Court in Doctor Sudhakar incident
  • పిల్ వేసిన రైల్వే రిటైర్డు ఉద్యోగి
  • సుధాకర్ హక్కులకు భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరించారు
  • సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించారు
డాక్టర్ సుధాకర్ ను వైజాగ్ పోలీసులు అరెస్ట్ చేసిన ఘటనపై ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. రైల్వే రిటైర్డ్ ఉద్యోగి చింతా వెంకటేశ్వర్లు ఈ పిల్ వేశారు. డాక్టర్ సుధాకర్ హక్కులకు భంగం కలిగించేలా పోలీసులు వ్యవహరించారని... అర్ధ నగ్నంగా రోడ్డుమీద అరెస్ట్ చేశారని పిటిషన్ లో పేర్కొన్నారు.

సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకంగా పోలీసులు వ్యవహరించారని తెలిపారు. డాక్టర్ పై దాడికి పాల్పడిన పోలీసులపై చట్టపరమైన చర్యలను తీసుకోవాలని కోరారు. మరోవైపు, డాక్టర్ సుధాకర్ ప్రస్తుతం విశాఖ మానసిక వ్యాధుల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
Doctor Sudhakar
Vizag
AP High Court
PIL

More Telugu News