జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి వైజాగ్ డాక్టర్ అంశం!

18-05-2020 Mon 19:37
  • లేని కేసును కూడా పోలీసులు సృష్టిస్తారన్న హర్షకుమార్ 
  • తన పైనే దొంగ కేసు పెట్టారని వ్యాఖ్య
  • డాక్టర్ ను కొట్టిన వారు, పిచ్చోడని సర్టిఫికెట్ ఇచ్చిన వారు జైలుకు వెళతారన్న విల్సన్
I know how police create a false case says Harsha Kumar

వైజాగ్ డాక్టర్ సుధాకర్ పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై ఓ న్యూస్ ఛానల్ డిబేట్ లో మాజీ ఎంపీ హర్షకుమార్, బీజేపీ నేత విల్సన్ మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు.

డాక్టర్ సుధాకర్ ఘటన చూస్తుంటే చాలా బాధగా ఉందని హర్షకుమార్ అన్నారు. లేని కేసును పోలీసులు ఎలా సృష్టిస్తారనే విషయాన్ని తాను స్వయంగా చూశానని చెప్పారు. ఎంపీగా పని చేసిన తనపైనే పోలీసులు దొంగ కేసు పెట్టారని తెలిపారు.

బీజేపీ నేత విల్సన్ మాట్లాడుతూ, ఏపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వానికి కొమ్ములు రావడానికి ఇండియన్ మెడికల్ అసోసియేషనే కారణమని చెప్పారు. డాక్టర్ సుధాకర్ అంశాన్ని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్లామని చెప్పారు. డాక్టర్ సుధాకర్ ను కొట్టినవాళ్లు, ఆయన పిచ్చోడంటూ సర్టిఫికెట్ ఇచ్చినవాళ్లు అందరూ జైలుకు వెళ్తారని అన్నారు.