సినిమాల్లో నటించడంపై కీలక ప్రకటన చేసిన ఛార్మి!

18-05-2020 Mon 19:13
  • ఇకపై సినిమాల్లో నటించను
  • ఇండస్ట్రీలోకి ట్యాలెంట్ ఉన్న హీరోయిన్లు వస్తున్నారు
  • 'జ్యోతిలక్ష్మి' సమయంలోనే రిటైర్ అవుదామని అనుకున్నా
I am not going to act further says Charmi

ఇకపై తాను నటించదలుచుకోలేదని హీరోయిన్ ఛార్మి స్పష్టం చేసింది. ఇండస్ట్రీలోకి కొత్త హీరోయిన్లు వస్తున్నారని... వారంతా ట్యాలెంట్ ఉన్నవారేనని చెప్పింది. ఈ తరుణంలో తాను నటించాలి అనుకోవడం లేదని తెలిపింది. వాస్తవానికి 'జ్యోతిలక్ష్మి' సినిమా సమయంలోనే నటిగా రిటైర్ అవుదామని భావించానని... అయితే పూరి జగన్నాథ్, కల్యాణ్ సలహాతో  ఆ విషయాన్ని ప్రకటించలేదని చెప్పింది.

ఇదిలావుంచితే, పూరి జగన్నాథ్ తో కలిసి ఛార్మి సినీ నిర్మాణాన్ని చేపట్టిన సంగతి తెలిసిందే. 'ఇస్మార్ట్ శంకర్' సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించింది. ప్రస్తుతం విజయ్ దేవరకొండ హీరోగా సినిమాను నిర్మిస్తోంది. తాజా ప్రకటనతో ఇకపై ఆమె పూర్తి స్థాయిలో సినీ నిర్మాణంపైనే దృష్టిని కేంద్రీకరించనున్నట్టు అర్థమవుతోంది.