ఇలాంటి దారుణాలపై అందరూ గళమెత్తాలి: రష్మి ట్వీట్

18-05-2020 Mon 17:53
  • నెల్లూరు జిల్లాలో దారుణం
  • 6 ఏళ్ల బాలికతో పని చేయించిన వైనం
  • ఒక కానిస్టేబుల్ కు చార్జ్ మెమో
Rashmi speaks against child labour

నెల్లూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఇంటర్మీడియట్ స్పాట్ వాల్యుయేషన్ సెంటర్ లో 6 ఏళ్ల బాలికతో పని చేయించారు. ఈ ఘటనపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ బాలిక వాచ్ మేన్ కుమార్తె. పక్కన ఉంటూ దీన్ని ఆపలేకపోయిన కానిస్టేబుల్ కు పైఅధికారులు చార్జ్ మెమో ఇష్యూ చేశారు. మరోవైపు దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై సినీ నటి, యాంకర్ రష్మి కూడా స్పందించింది. ఈ ఘటనను ఒక సాధారణ అంశంగా చూడకూడదని రష్మి చెప్పింది. ఇలాంటి ఘటనలకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ గళాన్ని వినిపించాలని కోరింది.