మత్తు డాక్టర్ ను సస్పెండ్ అయ్యేదాక రెచ్చగొట్టారు: చంద్రబాబుపై విజయసాయి ఫైర్

18-05-2020 Mon 15:33
  • చంద్రబాబుకు శాదన్ ఫ్రాయిడా అనే రుగ్మత వచ్చింది
  • మత్తు డాక్టర్ ను పచ్చ పార్టీ వాళ్లు రోడ్డున పడేశారు
  • పిచ్చిగా ప్రవర్తిస్తుంటే పోలీసులు మెంటల్ ఆసుపత్రికి తరలించారు
Chandrababu behaving like Neero says Vijayasai Reddy

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మండిపడ్డారు. కరోనాతో ప్రజలు టెన్షన్ పడుతుంటే నీరో చక్రవర్తిలా చంద్రబాబు ఫిడేల్ వాయించుకుంటున్నారని అన్నారు. తోటివారి దురదృష్టాన్ని చాటుగా గమనిస్తూ ఆనందించేవారిని సైకాలజీలో శాదన్ ఫ్రాయిడా అనే రుగ్మతకు గురైన వారిగా భావిస్తారని చెప్పారు. చంద్రబాబుది అదే కేసు అని అన్నారు.

తన మానాన తాను ఉద్యోగం చేసుకుంటూ బతుకుతున్న మత్తు డాక్టర్ ను పచ్చ పార్టీ వాళ్లు రోడ్డున పడేశారని విజయసాయి చెప్పారు. సస్పెండ్ అయ్యేదాక రెచ్చగొట్టారని అన్నారు. మత్తు డాక్టర్ పిచ్చిపిచ్చిగా ప్రవర్తిస్తుంటే పోలీసులు మెంటల్ హాస్పిటల్ కు తరలించారని చెప్పారు. యాక్యూట్ అండ్ ట్రాన్సియెంట్ సైకోసిస్ వచ్చిందని సైకియాట్రిస్టులు తేల్చారని తెలిపారు. కరోనాపై పోరుకు చంద్రబాబు ఇచ్చిన రూ. 10 లక్షల విరాళాన్ని ఐదు కోట్ల మందికి పంచితే... తలా రెండు పైసలు వస్తాయని నెటిజెన్లు లెక్క తేల్చారని చెప్పారు. 'కుటుంబానికి ఒక కోడిగుడ్డు కూడా రాదు కదా చంద్రబాబు' అని ఎద్దేవా చేశారు.