Yediyurappa: ఈ మూడు రాష్ట్రాల ప్రజలు మా రాష్ట్రంలో అడుగుపెట్టొద్దు: యడియూరప్ప

  • మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడుల్లో అధిక  కరోనా కేసులు
  • జాగ్రత్త చర్యలలో భాగంగా ఈ రాష్ట్రాల వారిని రావద్దన్న సర్కారు
  • కర్ణాటకలో తెరుచుకుంటున్న దుకాణాలు
Yediyurappa requests 3 states people not to come to Karnataka

మన దేశంలో మహారాష్ట్ర, గుజరాత్, తమిళనాడు రాష్ట్రాల్లో కరోనా కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి. ఇతర రాష్ట్రాల్లో పరిస్థితి కొంతమేర మెరుగుపడుతున్నప్పటికీ... ఈ మూడు  రాష్ట్రాల్లో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాల నుంచి తమ రాష్ట్రంలోకి ఎవరూ రావద్దని కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప కోరారు.

 ఈ మూడు రాష్ట్రాల్లో కరోనా కేసులు ఎక్కువగా ఉండటం వల్లే తాము కఠిన నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ఉన్నతాధికారులు తెలిపారు. ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పక్క రాష్ట్రాలతో అవగాహనతో ప్రజలను, వాహనాలను అనుమతించవచ్చని కేంద్ర ప్రభుత్వం సూచించిన సంగతి తెలిసిందే. మరోవైపు రాష్ట్రంలో అన్ని దుకాణాలు తెరుచుకోవచ్చని, రాష్ట్రం లోపల తిరిగే రైళ్లకు అనుమతినిస్తున్నట్టు ముఖ్యమంత్రి తెలిపారు.

More Telugu News