Gold: ఆకాశాన్నంటుతున్న పసిడి... అదేబాటలో వెండి కూడా!

  • 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,865
  • వెండి కిలో ధర 48,208
  • అంతర్జాతీయ పరిణామాలతో బంగారం ధరలు పైపైకి!
Gold price reaches too high

కరోనా వైరస్ ప్రభావం ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసింది. దాంతో మదుపరుల దృష్టి బంగారంపై పడింది. పెట్టుబడులు పెట్టేందుకు బంగారం మాత్రమే అనువైనదిగా మదుపరులు భావిస్తున్నారు. దాంతో పసిడి రేటు అమాంతం పెరిగిపోయింది. ఇవాళ్టి ట్రేడింగ్ లో 10 గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ.47,865కి చేరింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో నానాటికి బంగారం ధరలు పైపైకి ఎగబాకుతుండడంతో మరికొన్ని రోజుల్లోనే రూ.50 వేల మార్కు చేరడం ఖాయంగా కనిపిస్తోందని మార్కెట్ వర్గాలంటున్నాయి.

అంతర్జాతీయంగానూ బంగారం ధరలు ఇదే రీతిలో కొనసాగుతున్నాయి. అమెరికాలో కరోనా కల్లోలం, అక్కడి ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడం, చైనాతో అమెరికా వాణిజ్య పోరాటం బంగారం ధర పెరుగుదలకు కారణాలు అని అంచనా వేస్తున్నారు. ఇక, బంగారం బాటలోనే వెండి ధరలు కూడా పెరిగాయి. కిలో వెండి రూ.48,208 ధర వద్ద ట్రేడవుతోంది.

More Telugu News