నిశ్చితార్థం జరిపి కరోనా తెచ్చుకున్నారు... హైదరాబాదులో మరో క్లస్టర్ కేసు

18-05-2020 Mon 13:21
  • మే 11న ధూల్ పేట్ లో నిశ్చితార్థం
  • పెళ్లికొడుకు కుటుంబ సభ్యులకు కరోనా
  • కరోనాతో పెళ్లికొడుకు తండ్రి మృతి!
After engagment fifteen members tested corona positive

హైదరాబాదులో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది. నిన్న ఓ అపార్ట్ మెంట్ లో పాతికమందికి కరోనా సోకిందన్న విషయం తీవ్ర చర్చనీయాంశంగా ఉండగానే, నేడు ఓ కుటుంబంలో 15 మందికి కరోనా నిర్ధారణ కావడం అధికార వర్గాల్లో ఆందోళన కలిగిస్తోంది.

ఇటీవలే ఓ పెళ్లి నిశ్చితార్థం జరిపిన పెళ్లికొడుకు కుటుంబంలో 15 మంది కరోనా బారినపడ్డట్టు గుర్తించారు. ఈ కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి (58) కరోనాతో శనివారం నాడు మరణించడంతో ఈ కేసులన్నీ వెలుగులోకి వచ్చినట్టు తెలుస్తోంది. ఈ నిశ్చితార్థం మే 11న హైదరాబాదులోని ధూల్ పేట్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి లాక్ డౌన్ నిబంధనలు, భౌతికదూరం సూచనలు పక్కనబెట్టి పెద్ద సంఖ్యలో అతిథులు హాజరైనట్టు సమాచారం. ఇప్పుడు వారందరి వివరాలు సేకరించేందుకు అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.