తండ్రి మహేశ్‌ బాబుతో ఆడుతూ నవ్వు ఆపుకోలేకపోయిన గౌతం.. వీడియో ఇదిగో

18-05-2020 Mon 13:14
  • వీడియో పోస్ట్‌ చేసిన నమ్రత
  • తండ్రీకొడుకుల బ్లింక్ అండ్‌ యు లూజ్ కాంపిటేషన్
  • కళ్లు కొట్టకుండా ఉండలేకపోయిన గౌతం
 For those of u who r new to this game this was a blink and you lose

కరోనా విజృంభణ నేపథ్యంలో లాక్‌డౌన్‌ విధించడంతో షూటింగులు లేకపోవడంతో ఇంట్లోనే గడుపుతున్న సినీనటుడు మహేశ్‌ బాబు ఈ ఖాళీ సమయాన్ని తమ కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నాడు. ఇంట్లో తన కుమారుడు, కూతురితో ఆడుకుంటూ వీడియోలు తీసుకుంటున్నాడు. తన భర్త మహేశ్‌ బాబు, కుమారుడు గౌతమ్ కు సంబంధించిన మరో వీడియోను నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇందులో మహేశ్ బాబు తన కుమారుడితో ఆడుకుంటూ కనపడుతున్నాడు.

'ఈ గేమ్‌ గురించి తెలియని వారి కోసం ఇది పోస్ట్ చేస్తున్నాను. ఇది బ్లింక్ అండ్‌ యు లూజ్ కాంపిటేషన్. అయితే, జీజీ (ఘట్టమనేని గౌతం) ఈ గేమ్ ఆడేటప్పుడు నవ్వు ఆపుకోలేకపోయాడు. కళ్ల రెప్పలు కొట్టకుండా ఉండలేకపోయాడు' అని తెలిపింది. ఈ గేమ్‌ ఆడుతున్నప్పుడు కనురెప్పలు మూయకుండా ఉండాలి. ఎవరు ముందుగా కనురెప్పలు కొడితే వారు ఓడినట్లు.