ఎన్టీఆర్‌ అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేసే ప్రకటన చేసిన 'ఆర్‌ఆర్‌ఆర్'‌ టీమ్!

18-05-2020 Mon 13:00
  • మే 20న ఎన్టీఆర్ బర్త్‌ డే
  • వీడియో విడుదల చేయాలనుకున్న ఆర్‌ఆర్‌ఆర్
  • పనులు పూర్తి కాలేదని ప్రకటన
  • వీడియో, ఫస్ట్‌లుక్‌ విడుదల చేయబోమని ప్రకటన
we couldnt finish work on a glimpse of tarak

రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కుతున్న భారీ చిత్రం ఆర్ఆర్ఆర్‌ నుంచి తారక్ బర్త్ డే సందర్భంగా ఓ ప్రత్యేక వీడియో, ఆయన ఫస్ట్ లుక్‌ విడుదల చేయాలని ఆ సినిమా బృందం నిర్ణయించిన విషయం తెలిసిందే. కొమరం భీమ్ పాత్రను పరిచయం చేస్తూ మే 20న వీడియోను రిలీజ్ చేస్తారని ఆశ పడిన అభిమానులను నిరాశే మిగిలింది.

'లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించారు.. పనులు ఆగిపోయాయి.. అయినప్పటికీ మేము వీలైనంత ప్రయత్నించాం. తారక్ బర్త్ డేకి ట్రీట్‌ ఇవ్వాలని భావించాం. కానీ, ‌ వీడియోకు సంబంధించిన పనులు పూర్తి చేయలేకపోయాం' అంటూ ఆర్‌ఆర్‌ఆర్‌ ప్రకటన చేసింది. దీంతో ఎన్టీఆర్‌ బర్త్‌ డేకు వీడియోగానీ, ఫస్ట్‌లుక్‌ గానీ విడుదల చేయట్లేదని స్పష్టం చేసింది.
 
ఏదో ఒకటి విడుదల చేసేయాలన్నది తమకు ఇష్టం ఉండదని, మీ ఎదురుచూపులకు తగ్గా రీతిలో అది ఉంటుందని ప్రామిస్ చేస్తున్నామని పేర్కొంది. అది ఎప్పుడు వచ్చినా, మనందరికీ ఒక పెద్ద పండగలా ఉంటుందని మాత్రం కచ్చితంగా చెప్పగలమని ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ తెలిపింది. అయితే, ఈ ప్రకటనపై ఎన్టీఆర్‌ అభిమానులు మండిపడుతూ కామెంట్లు చేస్తున్నారు.