అబుదాబిలోని ఇండియన్లకు సల్మాన్ ఖాన్‌ సూచనలు!

18-05-2020 Mon 11:59
  • కరోనాపై పోరులో హీరోలుగా నిలవాలి
  • ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి సహకరించాలి
  • ప్రజలు సర్కారు మార్గదర్శకాలను పాటించాలి
  • ఇళ్ల నుంచి బయటికి రాకూడదు
salman khan suggestions to indians in uae

కరోనా విజృంభణ నేపథ్యంలో యూఏఈలోని భారతీయులకు బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కీలక సూచనలు చేశారు. కరోనాపై పోరులో అబుదాబిలో ఉన్న భారతీయులు హీరోలుగా నిలవాలని ఆయన చెప్పారు. కరోనా కట్టడి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆయన తన సోషల్ మీడియా ఖాతాల్లో వీడియో సందేశం ద్వారా పేర్కొన్నారు.

ప్రజలు సర్కారు మార్గదర్శకాలను పాటించాలని, అత్యవసర వస్తువులకు తప్ప, ఇళ్ల నుంచి బయటికి రాకూడదని ఆయన కోరారు. ఒక వేళ ఎవరిలోనైనా కరోనా లక్షణాలు కనిపిస్తే  పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. కొవిడ్‌-19 కట్టడి చర్యలను పాటించాలని, తమ కుటుంబాల రక్షణలో తామే హీరోలు కావాలని ఆయన పిలుపునిచ్చారు. యూఏఈలో ఆయనకు పెద్ద ఎత్తున అభిమానులున్నారు.