'ఫైట్ అక్కర్లేదు... మీ ట్వీటే చాలు'... పీవీపీ ట్వీట్ పై హరీశ్ శంకర్

18-05-2020 Mon 11:56
  • మీ 'భాష, భావం రెండూ నన్ను అలరించాయ్ 
  • ఫైట్ చేయడానికి ట్వీట్ చాలు
  • నా పనితనాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలన్న హరీశ్ 
Harish Shanker Reply on PVP Tweet

"పైనున్న అమ్మవారు కిందున్న కమ్మవారు అంటూ మా బెజవాడను బ్రహ్మాండంగా చెప్పావు హరీశ్. బ్లేడ్ బాబు ఇకపై నీతో సినిమా తియ్యడట. వాడు యూట్యూబ్లో షార్ట్ ఫిల్మ్ కూడా తియ్యలేడు. నీకేమో నేనే కాక డజన్ల మంది నిర్మాతలు, మిరపకాయను మించి దువ్వాడను దాటించే సినిమా తియ్యడానికి... వెయిటింగ్" అంటూ పీవీపీ ఈ ఉదయం చేసిన ట్వీట్ పై హరీశ్ శంకర్ ఘాటు సమాధానాన్ని ఇచ్చారు.

"మీ 'భాష, భావం రెండూ నన్ను అలరించాయ్. ఓ మనిషిని చీల్చి చెండాడడానికి "ఫైటే" అక్కర్లేదు... "ట్వీటే" చాలు అని నిరూపించారు. మీ రేంజ్ మ్యాచ్ చేయాలనే నా ప్రయత్నం. నా పనితనాన్ని గుర్తించినందుకు ధన్యవాదాలు సార్" అంటూ ట్వీట్ చేశారు. ఇక హరీశ్ ఇచ్చిన సమాధానం బాగుందని, సరైన సమయంలో సరైన విధంగా సమాధానం ఇచ్చారని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.