కాయల కోసం చెట్టెక్కాను.. ఓ మహిళ చూసి కర్ర పట్టుకుని తరిమింది: హీరోయిన్ ర‌ష్మిక‌

18-05-2020 Mon 11:08
  • ట్విట్టర్‌లో అభిమానులతో ముచ్చట
  • తాను చేసిన సరదా పనులను చెప్పిన హీరోయిన్
  • మామిడికాయల కోసం చెట్టెక్కానన్న రష్మిక
rashmika mandanna memories

తాను ఓ సారి చోరీ చేయడానికి ప్రయత్నించానని హీరోయిన్‌ రష్మిక మందన్న తెలిపింది. తాజాగా ఆమె ట్విట్టర్‌లో అభిమానులతో ఛాట్ చేస్తూ కొన్నేళ్ల క్రితం చేసిన పనులను గుర్తుకు తెచ్చుకుంది. చిన్న‌ప్పుడు మీరు చేసిన మ‌ర‌చిపోలేని సరదా పనులు చెప్పండి? అంటూ ఓ అభిమాని అడిగాడు.

దీనికి రష్మిక స్పందిస్తూ... తాను చిన్నప్పుడు స్నేహితులతో కలిసి ట్యూషన్ కు వెళ్లేదాన్నని, దారిలో ఓ మామిడి చెట్టు ఉండేదని చెప్పింది. ఒక రోజు  మామిడికాయలు కోసుకోవాలని తాను ఆ చెట్టు ఎక్కానని, దీంతో అక్కడున్న మహిళ తమను చూసి కర్ర తీసుకుని తిడుతూ తరిమిందని తెలిపింది. కాగా, సరిలేరు నీకెవ్వరు, భీష్మ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న చేతిలో ఇప్పుడు పలు సినిమాలు ఉన్నాయి.