Uddhav Thackeray: ఎమ్మెల్సీగా నేడు ప్రమాణ స్వీకారం చేయనున్న ‘మహా’ సీఎం

Maha CM Uddhav Thackeray oath taking ceremony will held today
  • ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించిన థాకరే
  • నేటి మధ్యాహ్నం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు
  • పదవీగండం నుంచి గట్టెక్కిన ఉద్ధవ్
మహారాష్ట్ర శాసనమండలికి ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికైన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరే సహా 9 మంది నేటి మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఖాళీగా ఉన్న 9 స్థానాలకు 9 మంది సభ్యులు మాత్రమే నామినేషన్ ధాఖలు చేయడంతో వారంతా ఎటువంటి పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

వీరిలో సీఎంతోపాటు శివసేన పార్టీ నేత నీలం గోర్హీ, బీజేపీ నేతలు గోపిచంద్ పడాల్కర్, ప్రవీణ్ దాట్కే, రంజిత్ సిన్హా మొహిత్  పాటిల్, రమేష్ కరద్‌లు ఉన్నారు. ఈ మధ్యాహ్నం వీరి ప్రమాణ స్వీకారానికి ముహూర్తం సిద్ధమైంది. కాగా, ఇప్పటి వరకు ఉభయ సభల్లో సభ్యుడు కాని ఉద్ధవ్ ఎమ్మెల్సీగా ఎన్నిక కాకుంటే పదవిని వదులుకోవాల్సి వచ్చేది. అయితే, ఆయన ఏకగ్రీవంగా ఎన్నిక కావడంతో పదవీ గండం నుంచి ఆయన గట్టెక్కారు.
Uddhav Thackeray
Maharashtra
MLC

More Telugu News