ఖమ్మం జిల్లాలో పెనుగాలి వేగానికి కదిలిన బస్సు... వైరల్ వీడియో!

18-05-2020 Mon 10:01
  • సత్తుపల్లిలో గాలుల తీవ్రత
  • 100 మీటర్లు వెళ్లిపోయిన పార్క్ చేసిన బస్సు
  • చెట్టును ఢీకొని ఆగిన బస్సు వీడియో వైరల్
Strong Wind Moved Parking Bus

పెనుగాలి తీవ్రతకు పార్కింగ్ చేసిన బస్సు దాదాపు 100 మీటర్లకు పైగా జారిపోయింది. ఈ ఘటన ఖమ్మం జిల్లా సత్తుపల్లి సమీపంలో జరుగగా, ఈ మొత్తం ఘటనను అక్కడున్న వారు కొందరు తమ స్మార్ట్ ఫోన్లలో చిత్రీకరించడంతో వైరల్ అయింది.

పట్టణ శివారులోని మారుతి రెస్టారెంట్ సమీపంలో ఓ ప్రైవేటు బస్సును పార్క్ చేసి ఉంచగా, భారీ ఎత్తున ఈదురుగాలి వీచింది. గాలి వేగానికి బస్సు జారుకుంటూ వెళ్లి, రోడ్డును దాటి, అవతలివైపున ఉన్న చెట్టును ఢీకొంది. ఆ సమయంలో బస్సు టైర్లకు రాయిని అడ్డు పెట్టాలని అక్కడున్నవారు భావించినా, గాలి వేగాన్ని చూసి, ఆ సాహసం చేయలేకపోయారు. ఆ సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడం, రోడ్డుపై ఎటువంటి వాహనాలూ రాకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ వీడియోను మీరూ చూడవచ్చు.