ఒబామాకు కౌంటర్ ఇచ్చిన డొనాల్డ్‌ ట్రంప్‌!

18-05-2020 Mon 09:46
  • ఇటీవల ట్రంప్‌పై ఒబామా విమర్శలు
  • కరోనా కట్టడిలో విఫలమయ్యారని వ్యాఖ్య
  • ఒబామానే అసమర్థ అధ్యక్షుడన్న ట్రంప్
Barack Obama Was Grossly Incompetent Donald Trump After Coronavirus Criticism

అమెరికాలో కొవిడ్‌-19 తీవ్ర స్థాయిలో విజృంభిస్తోన్న నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా పరోక్షంగా తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. కరోనా మహమ్మారిని ఎదుర్కొనే క్రమంలో డొనాల్డ్‌ ట్రంప్‌ ఘోరంగా విఫలమయ్యారని ఆయన విమర్శించారు. దీనిపై ట్రంప్‌ స్పందిస్తూ కౌంటర్‌ ఇచ్చారు.

తాజాగా శ్వేతసౌధంలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న ట్రంప్ మాట్లాడుతూ... 'ఆయన (ఒబామా) అసమర్థ అధ్యక్షుడు. పూర్తిగా అసమర్థ అధ్యక్షుడు. నేను చెప్పగలిగే విషయం ఇదే' అని వ్యాఖ్యానించారు. కాగా, బాధ్యతాయుత పదవుల్లో ఉన్న వ్యక్తులు తమ బాధ్యతను ఎలా సమర్థంగా నిర్వహిస్తున్నారో చెప్పాలని ట్రంప్‌పై ఒబామా పరోక్షంగా విమర్శలు చేయడం హాట్‌ టాపిక్‌గా మారింది. కాగా, అమెరికాలో కరోనా కేసుల సంఖ్య 14,84,804కు చేరింది. 89,399 మంది ప్రజలు ప్రాణాలు కోల్పోయారు.