Andrew Cumo: టీవీ చానెల్ లైవ్ లో కరోనా టెస్ట్ చేయించుకున్న న్యూయార్క్ గవర్నర్... వీడియో ఇదిగో!

New York Governor Takes Corona Test On TV Live
  • ఇప్పటికే పలుమార్లు కరోనా పరీక్షలు చేయించుకున్న ఆండ్రూ కూమో
  • తొలిసారిగా లైవ్ లో ప్రజల ముందు టెస్ట్
  • రేపు లైవ్ లోకి రాకుంటే, కరోనా సోకినట్టేనన్న కూమో
టీవీ చానెల్ లైవ్ లో పాల్గొన్న న్యూయార్క్ గవర్నర్ ఆండ్రూ కూమో ప్రత్యక్ష ప్రసారంలోనే కరోనా వైరస్ టెస్ట్ ను చేయించుకున్నారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ, నగర వాసుల్లో ఎవరికైనా కరోనా లక్షణాలు కనిపిస్తే, వెంటనే పరీక్షలు చేయించుకోవాలని, అందుకు తననే ఉదాహరణగా తీసుకోవాలని కోరారు. రోజువారీ కరోనా మీడియా బ్రీఫింగ్ లో పాల్గొన్న ఆయన, ప్రతి ఒక్కరూ క్రమం తప్పక పరీక్షలు చేయించుకుంటూ ఉండాలని కోరారు. అమెరికాలోనే కరోనాకు అతిపెద్ద హాట్ స్పాట్ గా న్యూయార్క్ అవతరించిందన్న సంగతి తెలిసిందే.

కేసుల సంఖ్య, మృతుల సంఖ్య, ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, లాక్ డౌన్ నిబంధనలు తదితరాలపై కూమో నిత్యమూ ప్రజలకు వివరిస్తుండగా, ఆయన లైవ్ కు ఆదరణ కూడా పెరిగింది. ఓ పీపీఈ కిట్ ధరించిన నర్స్ ఆయన వద్దకు వచ్చి, ముక్కు నుంచి నమూనాలను సేకరించారు. న్యూయార్క్ వాసులంతా మహమ్మారి విషయంలో తెలివిగా, ఐకమత్యంగా, క్రమశిక్షణగా వ్యవహరించాలని ఆయన కోరారు.

"రేపు నేను ఈ కార్యక్రమంలో కనిపించకపోతే... నాకు కరోనా సోకినట్టు" అని నమూనాల సేకరణ అనంతరం కూమో వ్యాఖ్యానించారు. ఇప్పటికే కూమోకు పలుమార్లు కరోనా పరీక్షలు జరిగినా, ఇలా ప్రత్యక్ష ప్రసారంలో మాత్రం వాటిని చూపించలేదు.
Andrew Cumo
NewYork
Governor
Corona Test

More Telugu News