Hyderabad: నాలుగు రోజులైనా కనిపించని చిరుత ఆచూకీ.. తలలు పట్టుకుంటున్న అధికారులు

No clue about leopard for the past 4 days
  • కాటేదాన్ అండర్‌బ్రిడ్జి రోడ్డుపై నాలుగు రోజుల క్రితం కనిపించిన చిరుత
  • పట్టుకునేందుకు వెళ్తే మాయం
  • దొరికే వరకు గాలిస్తామన్న అధికారులు
హైదరాబాద్ నగర శివారులోని కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై నాలుగు రోజుల క్రితం కనిపించి మాయమైన చిరుత ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నప్పటికీ చిరుత చిక్కకపోవడంతో అధికారులు తలలు పట్టుకుంటున్నారు. హై సెక్యూరిటీ కెమెరాలు, డ్రోన్లతో గాలించి, జంతువులను ఎరగా వేసినప్పటికీ చిరుత మాత్రం బయటకు రావడం లేదు.

చిరుత చిక్కకపోవడంతో హిమాయత్‌సాగర్ పరిసర గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు. ఒంటరిగా పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. మరోవైపు, చిరుత కోసం తీవ్రంగా వెతుకుతున్న అటవీ అధికారులు నిన్న హిమాయత్‌సాగర్ జలాశయం చుట్టుపక్కల గ్రామాలైన అజీజ్‌నగర్, కొత్వాలగూడ, కవ్వగూడ, మర్లగూడ పరిసరాల్లో గాలించారు. అయినప్పటికీ దాని జాడ కనిపించలేదు. ఏమైనా, చిరుతను బంధించే వరకు వెతుకుతూనే ఉంటామని అధికారులు తెలిపారు.
Hyderabad
Katedan
Leopard

More Telugu News