సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం   

18-05-2020 Mon 07:35
  • బాయ్ ఫ్రెండ్ సినిమాలో పాయల్ 
  • నెగటివ్ పాత్రలో అదితీరావు
  • డబ్బింగ్ పూర్తి చేసిన 'మాస్టర్'  
Payal Rajputh acted in a short film
*  అందాలభామ పాయల్ రాజ్ పుత్ తాజాగా ఓ షార్ట్ ఫిలింలో నటించింది. లాక్ డౌన్ కారణంగా దొరికిన ఈ ఖాళీ సమయంలో ఆమె బాయ్ ఫ్రెండ్ సౌరభ్ ధింగ్రా తీసిన ఓ లఘు చిత్రంలో పాయల్ నటించింది. గృహ హింస ఆధారంగా రూపొందిన ఈ చిత్రం పదహారు నిమిషాల నిడివితో సాగుతుంది.
*  కథానాయిక అదితీరావు హైదరి నెగటివ్ రోల్ లో కనిపించనుంది. నాని హీరోగా ఇంద్రగంటి మోహనకృష్ణ రూపొందిస్తున్న 'వి' చిత్రంలో అదితీరావు ఇలా నెగటివ్ పాత్రను పోషిస్తోంది. ఇందులో సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు.  
*  తమిళనాడులో పోస్ట్ ప్రొడక్షన్ పనులను చేసుకోవడానికి అక్కడి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో, విజయ్ హీరోగా నటించిన 'మాస్టర్' చిత్రం డబ్బింగు పనులను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే విజయ్ తన డబ్బింగ్ పార్ట్ పూర్తిచేశాడు. మరో ఇరవై రోజుల్లో మొత్తం నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసే పనిలో దర్శకుడు లోకేశ్ కనగరాజ్ వున్నాడు. వచ్చే నెలలో దీనిని రిలీజ్ చేస్తారు.