Congress: అది రూ.20 లక్షల కోట్ల ప్యాకేజి కాదు, రూ.3.22 లక్షల కోట్ల ప్యాకేజి మాత్రమే: కాంగ్రెస్ విమర్శలు

Congress attacks Centre on latest stimulus announced by PM Modi
  • ఇటీవల భారీ ప్యాకేజి ప్రకటించిన మోదీ
  • స్పందించిన కాంగ్రెస్ వర్గాలు
  • జీడీపీలో దాని శాతం 1.6 మాత్రమేనని వెల్లడి
కేంద్రం ప్రకటించిన ఉద్దీపనలపై కాంగ్రెస్ పార్టీ విమర్శనాత్మకంగా స్పందించింది. ఆర్థిక ప్యాకేజి పేరిట కేంద్రం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించింది. ప్రధాని రూ.20 లక్షల కోట్లతో ఉద్దీపన ప్యాకేజి ప్రకటించినా, ఆర్థికమంత్రి వెల్లడించిన ఆర్థిక చర్యలను పరిగణనలోకి తీసుకుంటే  ప్యాకేజి విలువ రూ.3.22 లక్షల కోట్లు మాత్రమేనని స్పష్టం చేసింది. జీడీపీలో దాని శాతం 1.6 మాత్రమేనని కాంగ్రెస్ విమర్శించింది.

కాంగ్రెస్ పార్టీ సీనియర్ అధికార ప్రతినిధి ఆనంద్ శర్మ మాట్లాడుతూ, ప్రధాని మోదీ తన మాట నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. చిన్న, మధ్య తరహా వ్యాపారులకు, పేదలకు నగదు సాయం చేసే దిశగా చర్యలు ప్రకటించాలని, ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవానికి అదే మార్గమని తెలిపారు. రుణాలు ఇవ్వడానికి, ఉద్దీపనలు ప్రకటించడానికి తేడా ఉందని అన్నారు. ప్రధాని ప్రకటించిన ప్యాకేజిపై చర్చకు సిద్ధమా అంటూ ఆనంద్ శర్మ కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కు సవాల్ విసిరారు.
Congress
Centre
Stimulus
Package
Narendra Modi
Nirmala Sitharaman
Lockdown

More Telugu News