మీడియా ముందు సోనియా గాంధీకి చేతులెత్తి నమస్కరించి వేడుకున్న నిర్మలా సీతారామన్!
- ప్రతిపక్ష పార్టీలకు నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను
- వలస కార్మికుల అంశంపై అందరం కలిసి పనిచేయాలి
- ఈ సమస్యపై మేము అన్ని రాష్ట్రాలతో కలిసి పని చేస్తున్నాం
- సోనియా గాంధీకి చేతులెత్తి నమస్కరిస్తూ ఈ విషయం చెబుతున్నాను
ఈ సందర్భంగా మీడియా ముందు చేతులు ఎత్తి నమస్కరించారు. వలస కార్మికుల విషయంలో రాజకీయాలు చేయడం తగదని ఆమె అన్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించే విషయంలో నిజాయతీగా వ్యవహరించాల్సింది పోయి, ఈ విషయంపై రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై కూడా ఆమె విమర్శలు గుప్పించారు. రాహుల్ గాంధీ ఇప్పటికైనా నాటకాలు మానుకోవాలని ఆమె సూచించారు.