Devineni Uma: భరోసా అంటే ఇదేనా? అని రైతులు అడుగుతున్నారు సమాధానం చెప్పండి జగన్ గారు: దేవినేని ఉమ

  • పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అధికారంలోకి వచ్చారు
  • మిర్చియార్డులో రైతుల వద్ద 2 కోట్ల మిర్చిటిక్కిలు నిలిచిపోయాయి.
  • వలస కూలీలపై తాడేపల్లిలో లాఠీలువిరిగాయి
  • భయంతో పిల్లలు పరుగులు తీశారు
devineni fires on ycp

కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుపై టీడీపీ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు మండిపడ్డారు. '3 వేల కోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధితో పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామని అధికారంలోకి వచ్చారు. గుంటూరు మిర్చియార్డు, కోల్డ్ స్టోరేజ్ లలో రైతుల వద్ద 3 వేల కోట్ల రూపాయల విలువైన 2 కోట్ల మిర్చిటిక్కిలు నిలిచిపోయాయి. మీరు కల్పించే భరోసా ఇదేనా? అని  రైతులు అడుగుతున్నారు సమాధానం చెప్పండి వైఎస్ జగన్ గారూ' అని ప్రశ్నించారు.

'వందలాది కిలోమీటర్లు నడిచివస్తున్న వలస కూలీలపై తాడేపల్లి రాజప్రసాదానికి కూతవేటు దూరంలో లాఠీలు విరిగాయి, భయంతో పరుగులు తీసిన పిల్లలు మహిళలు కార్మికుల ఆర్తనాదాలు మీకు వినబడలేదా? అన్నం పెట్టి నీరు అందించాల్సిన వ్యవస్థలు దాడులు చేయడం ఏంటీ ఇప్పటికైనా వారిని సొంతూళ్లకు పంపిస్తారా? జగన్ గారూ' అని ట్వీట్ చేశారు.

More Telugu News