COVID-19: భారత్‌లో తీవ్రతరమైన కరోనా.. 24 గంటల్లో రికార్డు స్థాయిలో 4,987 మందికి వైరస్ నిర్ధారణ

COVID19 Cases in India Rise to 90927 Death Toll at 2872
  • కేసుల సంఖ్య మొత్తం 90,927
  • 24 గంటల్లో దేశంలో 124 మంది మృతి
  • మృతుల సంఖ్య మొత్తం 2,872
  • కోలుకున్న 34,109 మంది
భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి, మరణాల సంఖ్య భారీగా పెరిగిపోతున్నాయి. కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం.. గత 24 గంటల్లో భారత్‌లో 4,987 మందికి కొత్తగా కరోనా సోకింది. ఇప్పటివరకు దేశంలో ఒక్క రోజులో నమోదయిన కేసుల్లో ఇదే గరిష్ఠం. దీంతో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 90,927కి చేరింది.

24 గంటల్లో దేశంలో 124 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనా మృతుల సంఖ్య మొత్తం 2,872కి చేరింది. అలాగే, కరోనా నుంచి 34,109 మంది కోలుకున్నారు. ఆసుపత్రుల్లో 53,946  మంది చికిత్స పొందుతున్నారు.
 
COVID-19
Corona Virus
India

More Telugu News