Emphan: రేపు ఉదయానికి తీవ్ర పెను తుఫాన్ గా మారనున్న ఎంఫాన్!

  • శనివారం రాత్రి తుఫాన్ గా మారిన ఎంఫాన్
  • పశ్చిమ బెంగాల్ వైపు వెళ్లే అవకాశం
  • పలు ప్రాంతాల్లో భారీ వర్షాలకు అవకాశం
Cyclone Emphan More Strengthened

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం, గత రాత్రి తుఫాన్ గా మారగా, నేటి సాయంత్రానికి పెను తుఫాన్ గా, రేపు ఉదయానికి తీవ్ర పెను తుఫాన్ గా మారనుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దీనికి 'ఎంఫాన్' అని నామకరణం చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎంఫాన్ ఒడిశాలోని పారాదీప్ కు 1,040 కిలోమీటర్ల దూరంలోనూ, పశ్చిమ బెంగాల్ లోని దిఘాకు 1,200 కిలోమీటర్ల దూరంలోనూ ఉంది. రేపు పశ్చిమ బెంగాల్ వైపునకు దిశను మార్చుకుని 20వ తేదీ నాటికి ఇది పశ్చిమబెంగాల్, బంగ్లాదేశ్ మధ్య తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.

ఇక, ఎంఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై అంతగా చూపించకున్నా, తీర ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని విశాఖ వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మత్స్య కారులు వేట నిమిత్తం సముద్రంలోకి వెళ్లరాదని, రేపటి నుంచి తీరం వెంబడి గాలుల తీవ్రత పెరుగుతుందని హెచ్చరించారు. ఎంఫాన్ కు ఉపరితల ద్రోణి కూడా తోడవడంతో పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించారు.

More Telugu News