Nara Rohit: నమ్మలేని విధంగా నారా రోహిత్ న్యూ లుక్...నెటిజన్ల ఫిదా!

Nara Rohit New Look goes Viral
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల ట్విట్టర్ ఖాతాలోకి ప్రవేశించిన నారా రోహిత్, తాజాగా పెట్టిన ఓ పిక్ వైరల్ అవుతోంది. తన కొత్త లుక్ ను ఫ్యాన్స్ కు ఆయన పరిచయం చేశారు. ఈ లుక్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. సన్నగా, ఫిట్ గా తయారైన రోహిత్, ఓ కాలేజీ స్టూడెంట్ లా కనిపిస్తున్నారని కామెంట్ చేస్తున్నారు.

మీసాలు లేకుండా, కూల్ గా కనిపిస్తున్న రోహిత్ చిత్రం వైరల్ అవుతోంది. త్వరలో ఆయన కొత్త చిత్రం ప్రారంభం కానుండగా, ఆ సినిమాకు సంబంధించినదే ఈ లుక్ అని సమాచారం. అంతకుముందు ఓ పవర్ ఫుల్ పోలీసు అధికారి స్టయిల్ లో మీసాలతో ఉన్న మరో పిక్ ను రోహిత్ పోస్ట్ చేయగా, అది కూడా అభిమానులను అలరించింది.
Go Back to Shorts
Nara Rohit
New Look
Twitter
Viral Pics

More Telugu News