RK Meena: డాక్టర్ సుధాకర్ తాగి రోడ్డుపై అనుచితంగా ప్రవర్తించినట్టు ఫిర్యాదులు వచ్చాయి: విశాఖ సీపీ

Vizag CP RK Meena explains Dr Sudhakar incident
  • విశాఖలో కలకలం రేపిన డాక్టర్ సుధాకర్ వ్యవహారం
  • రోడ్డుపై అర్ధనగ్నంగా నిరసన తెలిపేందుకు డాక్టర్ యత్నం
  • అప్పటికే ఆయన బాగా తాగి ఉన్నారని సీపీ వెల్లడి
విశాఖపట్నంలో డాక్టర్ సుధాకర్ వ్యవహారం మరో మలుపు తిరిగింది. డాక్టర్ సుధాకర్ ను చేతులు కట్టేసి, పోలీసులు లాఠీలతో కొట్టారంటూ టీడీపీ అధినాయకత్వం తీవ్ర ఆరోపణలు చేసింది. ఓ దళితుడిపై దాడి చేస్తారా అంటూ చంద్రబాబు, నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ ఘటనపై విశాఖ సీపీ ఆర్కే మీనా స్పందించారు. డాక్టర్ సుధాకర్ తాగి రోడ్డుపై అనుచితంగా ప్రవర్తించినట్టు తమకు ఫిర్యాదులు వచ్చాయని వెల్లడించారు. ఫిర్యాదులు వచ్చినందునే పోలీసులు డాక్టర్ సుధాకర్ ను అదుపులోకి తీసుకున్నారని, అప్పటికే ఆయన బాగా మద్యం తాగి ఉన్నారని వివరించారు. వైద్య పరీక్షల కోసం ఆ డాక్టర్ ను కేజీహెచ్ కు తరలించామని సీపీ తెలిపారు.

కాగా, రోడ్డుపై అర్ధనగ్నంగా నిరసన తెలిపేందుకు యత్నించిన డాక్టర్ సుధాకర్ ను విధుల్లో ఉన్న పోలీసులు తాళ్లతో కట్టి స్టేషన్ కు తరలించినట్టు తెలుస్తోంది.
RK Meena
Vizag CP
Dr Sudhakar
Police
Andhra Pradesh

More Telugu News