Haryana: బస్సు సర్వీసులను పునఃప్రారంభించిన తొలి రాష్ట్రంగా హర్యానా!

  • లాక్ డౌన్ విధించిన తర్వాత బస్సు సర్వీసుల పునరుద్ధరణ
  • జిల్లాల మధ్య బస్సు సర్వీసులు
  • సింగిల్ స్టాప్ బస్సులు ఏర్పాటు చేసిన హర్యానా
Haryana resumes inter district services

లాక్ డౌన్ నేపథ్యంలో ప్రజా రవాణా స్తంభించిన సంగతి తెలిసిందే. వలస కార్మికుల తరలింపు కోసం ఈ మధ్యనే శ్రామిక్ రైళ్లను ప్రారంభించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా (అంతర్ జిల్లాలు) బస్సు సర్వీసులను పునరుద్ధరించిన తొలి రాష్ట్రంగా హర్యానా నిలిచింది.

ఈ సందర్భంగా హర్యానా డీజీపీ మనోజ్ యాదవ్ మాట్లాడుతూ, ఇతర రాష్ట్రాలకు ఎంతో మందిని పంపుతున్నామని... ప్రయాణించే అవకాశం లేక మన రాష్ట్రంలోనే వేరే జిల్లాల్లో చిక్కుకుపోయిన వారి పరిస్థితి ఏమిటని ఆలోచించామని చెప్పారు. దీంతో అంతర్ జిల్లా బస్సులను ప్రారంభించాలనే నిర్ణయానికి వచ్చామని తెలిపారు. ఈ బస్సులు కేవలం గమ్యస్థానాల్లో మాత్రమే ఆగుతాయని... మధ్యలో ఎక్కడా ఆగవని చెప్పారు. కేవలం నాన్ ఏసీ బస్సులను మాత్రమే తిప్పుతున్నామని... బస్సులో సోషల్ డిస్టెన్స్ ఉండేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు.

More Telugu News