Nirmala Sitharaman: మరోసారి మీడియా ముందుకు వచ్చిన నిర్మలమ్మ... హైలైట్స్ ఇవిగో!

  • రూ.20 లక్షల కోట్లతో భారీ ప్యాకేజి ప్రకటించిన మోదీ
  • దశల వారీగా కేటాయింపుల వివరాలు చెబుతున్న నిర్మలా సీతారామన్
  • ఇవాళ నాలుగో విడత మీడియా సమావేశం
Nirmala Sitharaman press meet

ప్రధాని నరేంద్ర మోదీ రూ.20 లక్షల కోట్లతో ప్రకటించిన ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ పథకంలో కేటాయింపుల వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతి రోజూ మీడియా సమావేశం నిర్వహించి దశలవారీగా వెల్లడిస్తున్నారు. ఇవాళ నాలుగో విడత ప్యాకేజి వివరాలు తెలిపారు. ప్రధానంగా బొగ్గు, ఖనిజాలు, అణు విద్యుత్, రక్షణ రంగం, ఏరో స్పేస్, విమానయానం, విమాన మరమ్మతుల రంగాలకు సంబంధించిన కేటాయింపుల గురించి నిర్మల వెల్లడించారు.

ముఖ్యాంశాలు

  • టూరిజం, విమానయాన రంగానికి ప్రోత్సాహకాలు
  • పర్యాటక, రవాణా రంగానికి ప్రోత్సాహకాలు
  • అంతర్జాతీయ మార్కెట్లకు అనుగుణంగా దేశీయ సంస్కరణలు
  • ఉపాధి అవకాశాల పెంపుపై దృష్టి
  • కీలక రంగాల్లో పాలసీల సరళతరంపై దృష్టి
  • ప్రతి శాఖలో పెట్టుబడిదారులతో సమన్వయం కోసం ప్రాజెక్ట్ డెవలప్ మెంట్ సెల్
  • పెట్టుబడులు ప్రోత్సహించడంలో రాష్ట్రాలకు కొత్త విధానంలో ర్యాంకింగ్
  • సౌర శక్తి వంటి కొత్త రంగాల్లో పెట్టుబడులు సాధించిన రాష్ట్రాలకు ప్రోత్సాహకాలు
  • పారిశ్రామిక అవసరాల కోసం 5 లక్షల ఎకరాల భూమి సిద్ధం
  • బొగ్గు, ఖనిజాలు, రక్షణ ఉత్పత్తులపై ప్యాకేజి
  • ఏరో స్పేస్, విమానయాన రంగం, విమాన మరమ్మతులపై ప్యాకేజి
  • చిన్న నగరాలకు విమాన సౌకర్యాలు
  • 2020-21లో పారిశ్రామిక హబ్ లకు ర్యాంకులు
  • రాష్ట్రాల్లో ఇండస్ట్రియల్ క్లస్టర్లలో మౌలిక సదుపాయాల కనెక్టివిటీ అప్ గ్రేడ్
  • పరిశ్రమలకు అవసరమైన భూముల వివరాల కోసం ఐఐఎస్ విధానం
  • ఐఐఎస్ విధానం ద్వారా 3,376 పారిశ్రామిక పార్కులు, సెజ్ లు, 5 లక్షల హెక్టార్ల భూమి మ్యాపింగ్
  • జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా అందుబాటులో ల్యాండ్ బ్యాంక్ వివరాలు
  • బొగ్గు దిగమతులు తగ్గించాలని లక్ష్యం
  • కోల్ ధరలు నిర్ణయించనున్న కేంద్రం
  • బొగ్గు గనుల బిడ్డింగ్ విధానం మరింత సరళతరం
  • ఎలాంటి కండిషన్లు లేని బిడ్డింగ్ విధానం
  • బిడ్డింగ్ కు అందుబాటులో 50 గనులు
  • ఎవరైనా కోల్ మైన్ కోసం బిడ్డింగ్ వేసే అవకాశం
  • దేశవ్యాప్తంగా 500 కొత్త ఖనిజ లవణాల గనులు
  • తవ్వకం, ఉత్పత్తి, మార్కెటింగ్ కు అనుమతి
  • మైనింగ్ రంగంలో మౌలిక సదుపాయాల కోసం రూ.50 వేల కోట్లు
  • బొగ్గు గనుల యాంత్రీకరణ కోసం రూ.18 వేల కోట్లు
  • దేశీయంగానే ఆయుధ అనుబంధ ఉత్పత్తుల తయారీ
  •  ఆయుధాల దిగుమతులపై దశలవారీగా నిషేధం
  • రక్షణ రంగంలో మేకిన్ ఇండియాకు ప్రాధాన్యత
  • రక్షణ రంగంలో 49 శాతం నుంచి 74 శాతం వరకు ఎఫ్ డీఐలు
  • ఆయుధ ఒప్పందాల పరిశీలనకు ప్రాజెక్టు మేనేజ్ మెంట్ యూనిట్
  • 6 ప్రధాన ఎయిర్ పోర్టులను పీపీపీ పద్ధతిలో ప్రైవేటీకరణ, నిర్వహణ
  • వేలం ద్వారా ఎయిర్ పోర్టుల ప్రైవేటీకరణ
  • మరో 12 ఎయిర్ పోర్టుల్లో ప్రైవేటు పెట్టుబడులు పెంపు
  • పౌర విమానయాన రంగానికి రూ.1000 కోట్ల వరకు ప్రయోజనం
  • అంతరిక్ష రంగంలోనూ ప్రైవేటు పెట్టుబడులకు ప్రోత్సాహం
  • అంతరిక్ష రంగంలో ఇస్రోతో పాటు ప్రైవేటు సంస్థలకు కూడా అవకాశం
  • ఇస్రో సదుపాయాలు ఉపయోగించుకునేందుకు ప్రైవేటు సంస్థలకు వెసులుబాటు
  • పీపీపీ పద్ధతిలో పరమాణు కేంద్రాల అభివృద్ధి
  • క్యాన్సర్ ట్రీట్ మెంట్ కోసం ప్రత్యేకంగా హెల్త్ రియాక్టర్లు
  • నాణ్యమైన విద్యుత్ సరఫరా విషయంలో నిర్లక్ష్యం వహిస్తే పెనాల్టీలు
  • స్మార్ట్ ప్రీపెయిడ్ మీటర్ల ఏర్పాటు
  • విద్యుత్ రాయితీలు తగ్గించుకోవాలని సూచన
  • రాయితీలు నేరుగా నగదు రూపంలో ప్రజలకు ఇవ్వాలని స్పష్టీకరణ

More Telugu News