David Warner: వార్నర్ కాదు... అమరేంద్ర బాహుబలి!.. మరో వీడియో చేసిన ఆసీస్ క్రికెటర్

Warner made this time Bahubali video on Tik Tok
  • టిక్ టాక్ వీడియోలతో సందడి చేస్తున్న వార్నర్
  • తాజాగా బాహుబలి డైలాగ్ తో వీడియో
  • బాహుబలి వేషంలో అలరించిన ఆసీస్ ఓపెనర్
ఆస్ట్రేలియా డాషింగ్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ తెలుగు సినిమాలపై టిక్ టాక్ వీడియోలు చేయడం కొనసాగిస్తున్నాడు. తాజాగా బాహుబలి చిత్రంలోని అమరేంద్ర బాహుబలి అనే నేను అంటూ బరువైన డైలాగ్ చెప్పాడు. అచ్చం బాహుబలి తరహా వేషధారణలో కనిపించిన వార్నర్ ఆ డైలాగ్ చెప్పేందుకు ఎన్నోసార్లు తడబడ్డాడట. ఈ విషయం తనే చెప్పాడు. ఈ సినిమా ఏంటో చెప్పుకోండి అంటూ ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పోస్టు చేశాడు. ఇప్పటికే వార్నర్... అల్లు అర్జున్ నటించిన అల.. వైకుంఠపురములో చిత్రంలోని బుట్టబొమ్మా, రాములో రాములా పాటలకు స్టెప్పులేసి అలరించాడు. పోకిరి చిత్రంలోని మహేశ్ బాబు డైలాగు ఒక్కసారి కమిటైతే నా మాట నేనే విననంటూ కూడా సోషల్ మీడియాలో సందడి చేశాడు. మొత్తమ్మీద వార్నర్ ఈ లాక్ డౌన్ లో తెలుగు సినిమాలతో కాలం గడుపుతున్నట్టు అర్థమవుతోంది.

David Warner
Bahubali
TikTok
Video
Tollywood
Lockdown
Corona Virus

More Telugu News