Jagan: ఆర్టీసీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల తొలగింపు వ్యవహారంపై మంత్రి పేర్ని నాని స్పందన

RTC contract workers not terminated says Perni Nani
  • ఉద్యోగులను తొలగించారనే వార్తల్లో నిజం లేదు
  • ఎవరినీ తొలగించలేదు
  • జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పన మాత్రమే ఉంటుంది
6 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను ఏపీఎస్ఆర్టీసీ తొలగించినట్టు వార్తలు వెలువడిన సంగతి తెలిసిందే. వేలాది మంది ఉద్యోగాలు పోయాయనే వార్తతో కలకలం రేగింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మంత్రి పేర్ని నాని క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తల్లో నిజం లేదని చెప్పారు. ఆ ఉద్యోగులను ఎవర్నీ తొలగించలేదని తెలిపారు.

ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కరోనా వైరస్ రక్షణ ఇన్స్యూరెన్స్ లేదని... ఇన్స్యూరెన్స్ ఉన్న పర్మినెంట్ ఉద్యోగులను ముందుగా విధుల్లో వినియోగించుకోవాలని సర్క్యులర్ ఇచ్చామని చెప్పారు. జగన్ ప్రభుత్వంలో ఉద్యోగాల కల్పన మాత్రమే ఉంటుందని... ఉద్యోగాల తొలగింపు ఉండదని మంత్రి స్పష్టం చేశారు. 
Jagan
YSRCP
Perni Nani
APSRTC
Contract workers

More Telugu News