Trisha: మీ జీవిత భాగస్వామి దొరికారా? అనే ప్రశ్నకు త్రిష సమాధానం

Trisha response on her marriage
  • త్రిష వయసు 37 ఏళ్లు
  • గతంలో ఒక వ్యాపారవేత్తతో నిశ్చితార్థం
  • కెరీర్ పైనే దృష్టి పెట్టిన త్రిష
37 ఏళ్ల వయసు వచ్చినా హీరోయిన్ త్రిష ఇంకా తన పెళ్లి గురించి ఆలోచించడం లేదు. కెరీర్ పైనే పూర్తిగా దృష్టి సారించింది. అప్పుడప్పుడు ఆమె పెళ్లికి సంబంధించిన వార్తలు మీడియాలో ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. తాజాగా ఇదే విషయమపై ఇన్స్టాగ్రామ్ లైవ్ లో త్రిషను ఓ అభిమాని ప్రశ్నించాడు. మీ జీవిత భాగస్వామి దొరికారా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా... 'ఇంకా అతన్ని కలవలేదు' అని త్రిష చెప్పింది.

గతంలో ఓ సంబంధం త్రిష పెళ్లి వరకు వెళ్లింది. 2015లో చెన్నైకి చెందిన వ్యాపారవేత్త వరుణ్ మణియన్ తో త్రిష నిశ్చితార్థం జరిగింది. అయితే కొన్ని కారణాల వల్ల పెళ్లి రద్దైంది. మరోవైపు, తెలుగు హీరో రానాతో డేటింగ్ అంటూ వార్తలు కూడా వచ్చాయి.
Trisha
Tollywood
Marriage

More Telugu News