KTR: లాక్ డౌన్ తర్వాత జనాలు ఈ విధంగా రెచ్చిపోతారేమో: ఫన్నీ ట్వీట్ చేసిన కేటీఆర్

Telangana minister KTR makes a funny note about lock down after life
  • వారాంతంలో ఓ సరదా ఆలోచన వచ్చిందన్న కేటీఆర్
  • లాక్ డౌన్ తర్వాత జనాలు ఇష్టంవచ్చినట్టు చేసే అవకాశం ఉందంటూ ట్వీట్
  • ఇంకేం మిగల్చకుండా అన్నీ చేసేయండంటూ తమషా సందేశం
వారాంతంలో నింపాదిగా ఆలోచిస్తుంటే లాక్ డౌన్ తర్వాత అందరి కార్యకలాపాలు ఇలా ఉండొచ్చన్న ఊహ జనించిందని తెలంగాణ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో స్పందించారు. ప్రతి ఒక్కరూ తమలో తాము ఇలా ఆలోచించే అవకాశం ఉందంటూ వివరించారు.

"ఇక్కడెవరూ సజీవంగా బయటపడే పరిస్థితి లేనందున మరో ఆలోచన దిశగా మిమ్మల్ని మీరు నడిపించుకోవద్దు. మీ ఇష్టం వచ్చినట్టు చేసేయండి. రుచికరమైన ఆహారం భోంచేయండి. సూర్యరశ్మిని ఆస్వాదిస్తూ హాయిగా నడవండి. సముద్రంలో దూకండి. హృదయాన్ని ఓ పెన్నిధిలా పొదివిపట్టుకు తిరుగుతున్నామన్న సత్యాన్ని చాటిచెప్పండి. అప్పుడప్పుడు సిల్లీగా ఉండండి. కొంచెం దయతోనూ వ్యవహరించండి. మరికొంచెం విచిత్రంగానూ ఉండండి. ఇంకేదీ వదిలిపెట్టేందుకు సమయం లేదు. అన్ని ఇప్పుడే చేసేయండి" అంటూ సరదాగా ట్వీట్ చేశారు.
KTR
Lockdown
After Life
Twitter
Telangana
Corona Virus

More Telugu News