TTD: తిరుమల శ్రీవారి లడ్డూల అమ్మకాలు ప్రారంభం.. భారీగా వచ్చిన భక్తులు

laddoos sell in ttd
  • కరోనా విజృంభణ నేపథ్యంలో ఇటీవల నిలిచిన విక్రయాలు 
  • 55 రోజుల పాటు శ్రీవారి దర్శనం కూడా బంద్
  • స్వామి వారి నిత్య కైంకర్యాలను మాత్రం నిర్వహిస్తోన్న అర్చకులు
కరోనా విజృంభణ నేపథ్యంలో విధించిన లాక్‌డౌన్ కారణంగా నిలిచిపోయిన తిరుమల తిరుపతి దేవస్థాన శ్రీవారి లడ్డూ ప్రసాదం విక్రయాలు ఈ రోజు ఉదయం నుంచి మళ్లీ ప్రారంభమయ్యాయి. తిరుపతిలోని ప్రధాన పరిపాలన భవనం వద్ద వీటిని అమ్ముతున్నారు. లాక్‌డౌన్‌ వల్ల 55 రోజుల పాటు విక్రయాలు నిలిచిపోయిన శ్రీవారి లడ్డూలను మళ్లీ భక్తులు పొందే అవకాశం లభించింది. లడ్డూ విక్రయాలు ప్రారంభమయ్యాయని తెలుసుకున్న భక్తులు ఈ రోజు వాటి కోసం భారీగా తరలిరావడం గమనార్హం.

కరోనా విజృంభణతో శ్రీవారి దర్శనాన్ని నిలిపివేసిన విషయం తెలిసిందే. స్వామి వారి నిత్య కైంకర్యాలను మాత్రం అర్చకులు నిర్వహిస్తున్నారు. సామాజిక దూరం నిబంధనలను పాటిస్తూ పరిమిత సంఖ్యలో త్వరలో భక్తులకు శ్రీవారి దర్శనాన్ని కల్పించాలని ఆలయ అధికారులు భావిస్తున్నారు.
TTD
Tirumala
Tirupati

More Telugu News