Mahesh Babu: బొమ్మ పట్టుకుని పాట పాడుతూ సితారను కడుపుబ్బా నవ్వించిన మహేశ్ బాబు!

Mahesh babu  singing for his lovely daughter Sitara
  • వీడియో పోస్ట్ చేసిన నమ్రత
  • ఆయనలోని చిన్నపిల్లాడిని సితార మాత్రమే బయటకు తీసుకురాగలదు
  • ప్రేమ, జీవితం, నవ్వులు అంటూ వ్యాఖ్య
బొమ్మ పట్టుకుని ఓ పాట పాడుతూ తన కూతురు సితారను సినీనటుడు మహేశ్ బాబు కడుపుబ్బా నవ్వించిన సంఘటనకు సంబంధించిన ఓ వీడియోను ఆయన భార్య నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేసింది. ఇంట్లో సితారతో ఆడుకుంటూ మహేశ్ బాబు తీసుకున్న ఈ వీడియో ఆకట్టుకుంటోంది. 'ప్రేమ, జీవితం, నవ్వులు.. మహేశ్ బాబు, సితార పాప.. ఆయనలోని చిన్నపిల్లాడిని ఆమే బయటకు తీసుకురాగలదు' అని నమ్రత పేర్కొంది.


సినిమా షూటింగుల్లో బిజీగా ఉండే మహేశ్ బాబు ఖాళీ సమయం దొరికితే కుటుంబంతోనే గడుపుతాడు. ఇంట్లో తన కొడుకు, కూతురితో ఆడుకుంటూ గడుపుతాడు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో షూటింగులు లేకపోవడంతో కొన్ని రోజులుగా ఇంట్లోనే ఉంటున్న మహేశ్ బాబు ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా సమయాన్ని గడుపుతున్నాడు.    

                             
Mahesh Babu
sitara
Tollywood
Viral Videos

More Telugu News