Arun Prashant: తొలి సినిమా చూసుకోకుండానే కన్నుమూసిన యువ దర్శకుడు... కోలీవుడ్ లో విషాదం

  • కోయంబత్తూరులో రోడ్డుప్రమాదం
  • దర్శకుడు అరుణ్ ప్రశాంత్ దుర్మరణం
  • దిగ్భ్రాంతికి గురైన '4జీ' చిత్రబృందం
Young director Arun Prashant dies in a road mishap

ఎన్నో ఆశలతో సినీ రంగంలో ప్రవేశించి, అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి దర్శకుడిగా ఎదిగి తన తొలి సినిమాను థియేటర్లో చూసుకునే లోపే ఆ యువ దర్శకుడి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. స్టార్ డైరెక్టర్ శంకర్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసి, ఆపై జీవీ ప్రకాశ్ కుమార్, గాయత్రి సురేశ్ లతో 4జీ సినిమాకు దర్శకత్వం వహించిన అరుణ్ ప్రశాంత్ (వెంకట్ పక్కర్) విషాదాంతం ఇది. కోయంబత్తూరులోని మెట్టుపాళ్యం వద్ద బైక్ పై వెళుతుండగా ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో ప్రశాంత్ మరణించాడు.

శంకర్ వద్ద దర్శకత్వంలో మెళకువలు నేర్చుకున్న ప్రశాంత్ 2016లో తన తొలి సినిమా 4జీకి శ్రీకారం చుట్టారు. హైదరాబాదులో ముహూర్తం జరుపుకున్న ఈ చిత్రం ఆపై అనేక కారణాలతో వాయిదా పడుతూ వచ్చింది. ఇన్నాళ్లకు విడుదలకు సిద్ధమైన తరుణంలో దర్శకుడు ఈ లోకాన్ని విడిచిపోవడం చిత్ర బృందాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనిపై హీరో జీవీ ప్రకాశ్ తీవ్ర విచారం వ్యక్తం చేశాడు. స్నేహితుడు, సోదరుడి వంటి వ్యక్తి ఇక లేడన్న విషయం జీర్ణించుకోలేకపోతున్నామని తెలిపాడు.

More Telugu News