Rashid: కోహ్లీ కంటే బాబర్ అజామ్ మెరుగైన ఆటగాడని చెబుతున్న ఇంగ్లాండ్ స్పిన్నర్

England spinner Adil Rashid says Babar Azam better than Kohli
  • ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఇంగ్లాండ్ లెగ్ స్పినర్ అదిల్ రషీద్
  • ఇద్దరి ఫామ్ ను ప్రాతిపదికగా తీసుకున్నానని వెల్లడి
  • బాబర్ అజామ్ అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడంటూ వివరణ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఇటీవలే పాకిస్థాన్ పరిమిత ఓవర్ల జట్టు పగ్గాలు అందుకున్న స్టార్ బ్యాట్స్ మన్ బాబర్ అజామ్ లలో ఎవరు మేటి? అనే చర్చ ఎప్పటి నుంచో జరుగుతోంది. దీనిపై ఇంగ్లాండ్ లెగ్ స్పిన్నర్ అదిల్ రషీద్ స్పందించాడు. ఇద్దరిలో మెరుగైన ఆటగాడు ఎవరో తేల్చడం చాలా కష్టమైన విషయం అని పేర్కొన్నాడు.

అయితే ఇప్పటికిప్పుడు కోహ్లీ కంటే బాబర్ అజామ్ నాణ్యమైన ఆటగాడు అని భావిస్తానని వెల్లడించాడు. అందుకు కారణం కూడా వివరించాడు. ఈ ఇద్దరిలో ఎవరు మెరుగైన ఆటగాడో నిర్ణయించడానికి తాను ఫామ్ ను ప్రాతిపదికగా తీసుకున్నానని, ప్రస్తుతం బాబర్ అజామ్ అత్యుత్తమ ఫామ్ లో ఉన్నాడని అదిల్ రషీద్ తెలిపాడు. ఏదేమైనా ఇద్దరూ కూడా ప్రపంచస్థాయి ఆటగాళ్లని పేర్కొన్నాడు.
Rashid
Virat Kohli
Babar
India
Pakistan
England

More Telugu News