Central Minister: ‘కరోనా’ అదుపులోకి వచ్చాకే పాఠశాలలు తిరిగి ప్రారంభించేది: కేంద్ర మంత్రి పోఖ్రియాల్

  • ఉపాధ్యాయులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి
  • లాక్ డౌన్ తర్వాత అనుసరించాల్సిన ప్రణాళికలు రూపొందిస్తున్నాం
  • ఆన్ లైన్ డిజిటల్ లెర్నింగ్ ద్వారా పాఠాలు బోధించాలి
Central Minister Pokhriyal video conference

దేశంలో ‘కరోనా’ పరిస్థితి అదుపులోకి వచ్చాకే పాఠశాలలు తిరిగి ప్రారంభించాలని నిర్ణయించినట్టు కేంద్ర మానవ వరుల అభివృద్ధి శాఖ మంత్రి పోఖ్రియాల్ తెలిపారు. పలు పాఠశాలల ఉపాధ్యాయులతో ఈరోజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు.

ప్రస్తుత పరిస్థితుల్లో పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరిచే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. లాక్ డౌన్ అనంతరం అనుసరించాల్సిన ప్రణాళికలు రూపొందిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులకు ఆయన ఓ సూచన చేశారు. ఆన్ లైన్ డిజిటల్ లెర్నింగ్ ద్వారా పాఠాలు బోధించడం ఉపాధ్యాయులు అలవాటు చేసుకోవాలని, సిలబస్ పూర్తి చేసేలా ప్రణాళిక రూపొందించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

‘కరోనా’ తీవ్రత తగ్గిన తర్వాత 50 శాతం మంది విద్యార్థులతో పాఠశాలలను ప్రాథమికంగా ప్రారంభిస్తామని తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్శిటీల్లో తరగతులు ప్రారంభించే విషయాన్ని ప్రస్తావించారు. యూజీసీ మార్గదర్శకాలకు అనుగుణంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విశ్వవిద్యాలయాల్లో తరగతులు ప్రారంభించేందుకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు.

More Telugu News