Kerala: కేరళను కాస్త ఆలస్యంగా తాకనున్న నైరుతి రుతుపవనాలు

  • జూన్ 5న కేరళలో ప్రవేశించనున్న నైరుతి రుతుపవనాలు
  • బంగాళాఖాతంలో తుపాను పరిస్థితులు
  • రుతుపవనాల రాకపై ప్రభావం!
Monsoons will enter Kerala with a delay

రైతన్నలో ఆశలు రేకెత్తించే నైరుతి రుతుపవనాలు ఈసారి కాస్త ఆలస్యంగా వస్తాయని కేంద్రం పేర్కొంది. నైరుతి రుతుపవనాలు జూన్ 5న కేరళను తాకుతాయని భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) వెల్లడించింది. ఈమేరకు భూగర్భ విజ్ఞాన శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి మాధవన్ రాజీవన్ ట్వీట్ చేశారు. ఈసారి నైరుతి సీజన్ ముందే ఆరంభం అవుతోందని, మే 16నే రుతుపవనాలు అండమాన్ ను తాకుతాయని వాతావరణ విభాగం ఇటీవలే ప్రకటించింది. అయితే, బంగాళాఖాతంలో తుపాను పరిస్థితులు ఏర్పడడంతో రుతుపవనాల రాకపై ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది.

More Telugu News