APSRTC: 6 వేల మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాకిచ్చిన ఏపీఎస్ఆర్టీసీ

APSRTC fires contract employees
  • ఔట్ సోర్సింగ్ ఉద్యోగులపై వేటు వేసిన ఆర్టీసీ
  • భగ్గుమన్న కార్మిక సంఘాలు
  • ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని డిమాండ్
ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఏపీఎస్ఆర్టీసీ షాక్ ఇచ్చింది. ఏకంగా 6 వేల మందిపై వేటు వేసింది. ఈరోజు నుంచి విధులకు హాజరు కావద్దంటూ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు డిపో మేనేజర్లు ఉత్తర్వులు జారీ చేశారు. ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు విధుల నుంచి తొలగిస్తున్నట్టు డిపో మేనేజర్లు తెలిపారు. ఏప్రిల్ నెల జీతాలు కూడా వీరికి ఇంత వరకు అందలేదు.

ఈ నేపథ్యంలో, కార్మిక సంఘాలు భగ్గుమన్నాయి. ఆర్టీసీ యాజమాన్య తీరును వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించాయి. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను యథావిధిగా కొనసాగించాలని ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాలకాశి, కార్యదర్శి నూర్ మొహమ్మద్ డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు.
APSRTC
Contract Employees
Andhra Pradesh

More Telugu News