david warner: 'రాములో రాములా' పాటకు మరోసారి స్టెప్పులు వేసిన డేవిడ్‌ వార్నర్.. వీడియో ఇదిగో

david warner tiktok dancing
  • ఇటీవల బుట్టబొమ్మ పాటకు డ్యాన్స్‌
  • రాములో రాముల పాటకు చాలా వెరైటీగా ప్రయోగం చేసిన వార్నర్
  • బన్నీ అభిమానులను ఖుషీ చేస్తోన్న వరస వీడియోలు
టాలీవుడ్ హీరో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురములో సినిమాలోని ‘బుట్టబొమ్మ’ పాటకు ఆస్ట్రేలియా క్రికెటర్, ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు కెప్టెన్ డేవిడ్ వార్నర్ తన భార్య క్యాండీస్ వార్నర్‌తో కలిసి డ్యాన్స్ చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత రాములో రాములా పాటకు కూడా ఆ‌ దంపతులు డ్యాన్స్‌ చేశారు.

ఇప్పుడు డేవిడ్‌ వార్నర్‌ సింగిల్‌గా అదే పాటకు మరోసారి డ్యాన్స్‌ చేసి బన్నీ అభిమానులను ఖుషీ చేశారు. ఈ పాటకు ఆయన చేసిన టిక్‌టాక్‌ వీడియో వైరల్ అవుతోంది. కరోనాతో ఐపీఎల్ జరగకపోవడంతో ఇంట్లోనే ఉంటోన్న డేవిడ్ వార్నర్ పదే పదే టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వాటిని పోస్ట్ చేస్తున్నారు. ఆయన ప్రత్యేకించి తెలుగు పాటలకు డ్యాన్స్ చేస్తుండడం గమనార్హం. ఆయన పోస్ట్ చేస్తోన్న ప్రతి వీడియో తెలుగు సినీ అభిమానులను అలరిస్తోంది.
                         
david warner
Ala Vaikunthapuramulo
Viral Videos

More Telugu News