Pawan Kalyan: పవన్ కల్యాణ్ అభిమాని సబ్ కలెక్టర్.. ఫ్యాన్స్ సంతోషం!

Pawankalyan fans happiness about one of his fans became Sub collector
  • పవన్ కల్యాణ్ అభిమాని పృథ్వి తేజ
  • నాడు ‘పంజా’ ఆడియో వేడుకలో పృథ్వికి పవన్ సన్మానం
  • ఆ విషయాన్ని గుర్తుచేసుకున్న పవన్ ఫ్యాన్స్
దాదాపు తొమ్మిదేళ్ల క్రితం పవన్ కల్యాణ్ హీరోగా నటించిన సినిమా ‘పంజా’. నాడు ‘పంజా’ ఆడియో వేడుక గురించి పవన్ కల్యాణ్ అభిమానులు ఈరోజూ గుర్తుచేసుకుంటున్నారు. ఎందుకంటే, ఐఐటీ జేఈఈలో ఫస్ట్ ర్యాంక్ సాధించిన విద్యార్థి పృథ్వి తేజను ఆరోజున పవన్ సన్మానించి..అభినందించడమే కాదు, ఉన్నతశిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు.

ఆ పృథ్వి తేజ సివిల్స్ లో 24వ ర్యాంక్ సాధించి.. మదనపల్లె సబ్ కలెక్టర్ గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పవన్ అభిమానులు నాడు పవన్ తో పృథ్వి తేజ ఉన్న వీడియోను, ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచారు. పవన్ అభిమాని సబ్ కలెక్టర్ కావడం తమకు ఎంతో గర్వకారణం అని ఆయన అభిమానులు అంటున్నారు. పంజా చిత్ర నిర్మాత నీలిమ తిరుమలశెట్టి కూడా పృథ్వితేజను అభినందించారు.
Pawan Kalyan
Janasena
Fan
PridhivTeja
Sub collector
Madanpalle

More Telugu News