Katedan: ఇంకా కనిపించని చిరుత.. భయంభయంగా కాటేదాన్ వాసులు

  • 20 ట్రాప్ కెమెరాల ఏర్పాటు 
  • రెండు మేకలను ఎరగా వేసిన అధికారులు
  • డ్రోన్ కెమెరాలతో గాలించినా ఫలితం శూన్యం
No clue about leopard

రంగారెడ్డి జిల్లా మైలార్‌దేవ్‌పల్లి సమీపంలోని కాటేదాన్ అండర్ బ్రిడ్జి రోడ్డుపై నిన్న ఉదయం కనిపించి, పట్టుకునే క్రమంలో మాయమైన చిరుత ఆచూకీ ఇప్పటికీ లేకపోవడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.  దానిని బంధించేందుకు నిన్నటి నుంచి అటవీ, జూ అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. మాయమైన చిరుత కోసం 20 ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేశారు. నాలుగుసార్లు డ్రోన్ కెమెరాలతో గాలింపు జరిపారు. 2 మేకలను ఎరగా వేశారు. 10 శునకాలను అడవిలోకి పంపారు.. అయినప్పటికీ చిరుత జాడ మాత్రం కనిపించకపోవడంతో సమీప గ్రామాల ప్రజలు భయంతో వణికిపోతున్నారు.  

చిరుత ఫామ్ హౌస్ వెనక ఉన్న చెట్టుపై నక్కి ఉంటుందని అటవీ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు. అలాగే, శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు రోడ్డులో పెట్రోలు బంకుల యజమానులు, వివిధ దుకాణదారులు ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో గగన్‌పహాడ్ పెట్రోలు బంకు వద్ద వీధికుక్కలు గుంపుగా తరుముతున్న దృశ్యాలను అధికారులు గుర్తించారు. కుక్కలు తరుముతున్నది చిరుతనే అయి ఉండొచ్చని భావిస్తున్నారు. దీంతో అధికారులు ఆ ప్రాంతానికి చేరుకుని గాలిస్తున్నారు.

More Telugu News