Uber: 3700 మంది ఉద్యోగులను తొలగించిన ఉబెర్

  • మూడు నిమిషాలపాటు సాగిన కాల్
  • సంస్థలో ఇదే చివరి రోజన్న సంస్థ కస్టమర్ సర్వీస్ హెడ్
  • ముందస్తు నోటీసు లేకుండా ఇదేంటంటూ మండిపాటు
Uber lays off 3700 employees through Zoom

కరోనా వైరస్ లాక్‌డౌన్ నేపథ్యంలో నష్టాలపాలవుతున్న సంస్థలు ఉద్యోగులను దారుణంగా తొలగిస్తున్నాయి. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు చాలా సంస్థలు తమ ఉద్యోగులను చాలా వరకు తొలగిస్తున్నాయి. తాజాగా ట్యాక్సీ రైడింగ్ యాప్ ఉబెర్ కూడా అదే బాటపట్టింది. వీడియో కాన్ఫరెన్సింగ్ యాప్ జూమ్ ద్వారా నిన్న 3700 మంది ఉద్యోగులతో మాట్లాడిన ఆ సంస్థ కస్టమర్ సర్వీస్ హెడ్ రఫిన్ చావెలీ.. సంస్థలో వారికి ఇదే చివరి రోజుని, అందరినీ ఉద్యోగాల్లోంచి తొలగిస్తున్నట్టు చెప్పారు.

కేవలం మూడు నిమిషాలపాటు సాగిన ఈ కాల్‌ ద్వారా తమ ఉద్యోగుల్లో 14 శాతం మందిని తొలగించడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. ముందస్తు నోటీసు లేకుండా, అందరికీ ఒకేసారి కాల్ చేసి తొలగించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కాగా, కరోనా మహమ్మారి ప్రభావం ఉబెర్‌పై తీవ్రంగా పడింది. ఈ ఏడాది తొలి త్రైమాసికంలో ఉబెర్ 2.9 బిలియన్ డాలర్ల నికర నష్టాన్ని మూటగట్టుకుంది.

More Telugu News