Karnataka: లాక్‌డౌన్‌లోనూ గుంపులు గుంపులుగా ఉత్సవంలో పాల్గొన్న వేలాది మంది.. ఫొటోలు, వీడియో ఇవిగో

  • కర్ణాటక, రామనగర జిల్లాలో ఘటన
  • జాతర చేసుకున్న ప్రజలు
  • అనుమతి ఇచ్చిన అధికారి సస్పెన్షన్ 
Karnataka People gathered in large numbers in Kolagondanahalli village

లాక్‌డౌన్‌లో ఎటువంటి నిబంధనలూ పాటించకుండా వేలాది మంది ప్రజలు గుంపులు గుంపులుగా కనపడిన ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. రామనగర జిల్లా  కొలగొండనహళ్లి గ్రామంలో నిన్న జాతర జరిపారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఉత్సవాల కోసం ప్రజలు పంచాయతీ అభివృద్ధి శాఖ కార్యాలయంలో అనుమతి కూడా తీసుకున్నారు.
                          
అయితే, భౌతిక దూరం పాటించకుండా, మాస్కులు ధరించకుండా ఒకరిని ఒకరు తాకుతూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా పెద్ద ఎత్తున ప్రజలు ఇందులో పాల్గొన్నారు. దీంతో ఈ జాతరకు అనుమతి ఇచ్చిన పంచాయతీ అభివృద్ధి శాఖ అధికారి ఎన్‌సీ కల్మత్‌ను రామనగర డిప్యూటీ కమిషనర్ సస్పెండ్‌ చేశారు. కరోనా వైరస్‌ విజృంభిస్తోన్న సమయంలో ప్రజలు ఈ ఉత్సవంలో పాల్గొనడం పట్ల తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
               

More Telugu News