పారితోషికం విషయంలో పట్టువీడని తమన్నా?

15-05-2020 Fri 09:35
  • అందాల కథానాయికగా క్రేజ్
  • రవితేజ సినిమా కోసం సంప్రదింపులు
  • 3 కోట్లు అడిగిన తమన్నా?    
Nakkina Thrinadha Rao Movie
తెలుగు తెరపై చాలాకాలం నుంచి జోరు చూపుతూ వస్తున్న అందమైన కథానాయికలలో ఒకరుగా తమన్నా కనిపిస్తుంది. ఇటీవల కాలంలో తమన్నాకి కొంతవరకూ అవకాశాలు తగ్గాయి. తెలుగు .. తమిళ .. హిందీలో కలుపుకుని ఆమె చేస్తున్న సినిమాల సంఖ్య చాలా తక్కువ. అయినా పారితోషికం విషయంలో మాత్రం ఆమె ఎంతమాత్రం తగ్గడం లేదనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిపిస్తోంది.

రవితేజ కథానాయకుడిగా నక్కిన త్రినాథరావు ఒక సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా తమన్నా అయితే బాగుంటుందనే ఉద్దేశంతో  దర్శక నిర్మాతలు ఆమెను సంప్రదించారు. అయితే ఆమె 3 కోట్లు డిమాండ్ చేసిందట. రెండున్నర కోట్ల వరకూ ఇస్తామని చెప్పినా ఆమె మెట్టుదిగి రావడం లేదని చెప్పుకుంటున్నారు. రవితేజకి  తమన్నాకి మధ్య మంచి స్నేహం వుంది. గతంలో ఈ ఇద్దరూ కలిసి 'బెంగాల్ టైగర్' అనే హిట్ మూవీ చేశారు కూడా. రవితేజ సినిమా అనగానే తమన్నా ఒప్పుకుంటుందని భావించిన నిర్మాతలు, ఆమె భారీ పారితోషికాన్ని డిమాండ్ చేయడంతో ఆలోచనలో పడ్డారని సమాచారం. చివరిగా ఎవరు ఏ నిర్ణయం తీసుకుంటారో చూడాలి.