Anasuya: 'బిగ్ బాస్ 4' కోసం అనసూయతో సంప్రదింపులు

Aanasuya
  • అనసూయకి యూత్ లో విపరీతమైన క్రేజ్
  • 'బిగ్ బాస్ 4' నుంచి భారీ ఆఫర్
  • ఆసక్తిని చూపని అనసూయ
ఇతర భాషల్లో మాదిరిగానే తెలుగులోను 'బిగ్ బాస్' పాప్యులర్ షో గా కొనసాగుతోంది. ఇంతవరకూ  3 సీజన్లు కొనసాగగా, ఎన్టీఆర్ .. నాని .. నాగార్జున హోస్టులుగా వ్యవహరించారు. కొంతకాలంగా సీజన్ 4 కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సీజన్ కోసం ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీలను సంప్రదించినట్టుగా వార్తలు వచ్చాయి. రీసెంట్ గా అనసూయను కూడా ఈ షో నిర్వాహకులు సంప్రదించినట్టుగా వార్తలు వస్తున్నాయి.

గత సీజన్లో యాంకర్ శ్రీముఖిని ఎంపిక చేసుకున్న నిర్వాహకులు ఆమెకి ఎపిసోడ్ కి లక్ష రూపాయలను చెల్లించినట్టుగా చెప్పుకున్నారు. ఆ లెక్కన చూసుకుంటే అనసూయకు అంతకంటే ఎక్కువనే ఇవ్వవలసి ఉంటుంది. అందువలన షో నిర్వాహకులు భారీ మొత్తమే ఆఫర్ చేశారట. అయినా అనసూయ ఆసక్తిని చూపలేదని అంటున్నారు. అంతకాలం పాటు తాను ఫ్యామిలీకి దూరంగా  ఉండలేనని ఆఫర్ ను సున్నితంగా తిరస్కరించిందని చెబుతున్నారు. ఇక ఒక వైపున టీవీ షోలతోను ..  మరో వైపున సినిమాలతోను అనసూయ బిజీగా ఉండటం కూడా ఆమె 'నో' చెప్పడానికి కారణమని అనుకుంటున్నారు.
Anasuya
Anchor
Tollywood

More Telugu News