Corona Virus: 24 గంటల్లో లక్ష కేసులు.. అమెరికా, యూకే, బ్రెజిల్‌లో కరోనా విశ్వరూపం

Around one lakh Corona Cases registered yesterday
  • అమెరికాలో నిన్న 26,398 కేసులు, 1,703 మంది మరణం
  • కేసుల్లోనూ, మరణాల్లోనూ అమెరికా టాప్
  • బ్రెజిల్, రష్యా, ఇండియాలలో వేలల్లో కేసులు
అమెరికా, బ్రెజిల్, యూకేలో కరోనా వైరస్ చెలరేగిపోతోంది. ప్రపంచవ్యాప్తంగా నిన్న ఒక్క రోజే లక్ష కేసులు నమోదు కాగా, అమెరికాలో 26,398 కేసులు వెలుగుచూశాయి. బ్రెజిల్‌లో 13,761, రష్యాలో 9,974 కేసులు నమోదయ్యాయి. ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్‌లలో వందల సంఖ్యలోనే కేసులు నమోదయ్యాయి. భారత్‌లో నిన్న ఒక్క రోజే 3,942 మంది కరోనా బారినపడ్డారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా నమోదైన మొత్తం కేసుల సంఖ్య 45 లక్షల మార్క్ దాటిపోయింది.

మరోవైపు, అమెరికాలో నిన్న 1,703 మంది మరణించారు. స్పెయిన్‌లో 217 మంది, బ్రిటన్‌లో 428 మంది, ఇటలీలో 262 మంది, బ్రెజిల్‌లో 835 మంది, ఫ్రాన్స్‌లో 351 మంది మెక్సికోలో 294 మంది, కెనడాలో 170 మంది కరోనా కాటుకు బలయ్యారు. అమెరికాలో మొత్తంగా 86,900 మంది కరోనా వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయారు. మరణాల్లోనూ, కేసుల్లోనూ అమెరికా ప్రపంచంలోనే ముందుండడం గమనార్హం.
Corona Virus
America
Brazil
UK
India

More Telugu News