Sachin Tendulkar: సచిన్ టెండూల్కర్ కు క్షమాపణలు చెప్పిన 'స్పార్టన్'!

  • సచిన్, స్పార్టన్ మధ్య కాంట్రాక్టు
  • నిబంధనలు ఉల్లంఘించిన స్పార్టన్ సంస్థ
  • క్షమాపణలను అంగీకరించిన క్రికెట్ దిగ్గజం
Sparten Says Sorry to Sachin

ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ బ్యాట్ల తయారీ సంస్థ స్పార్టన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ కు క్షమాపణలు చెప్పింది. సచిన్ కు, స్పార్టన్ కు మధ్య గత కొంతకాలంగా ఒప్పంద ఉల్లంఘన వివాదం నడుస్తోంది. ఈ నేపథ్యంలో "ఇచ్చిన మాట తప్పినందుకు సచిన్ టెండూల్కర్‌ మన్నించాలి" అని స్పార్టన్‌ సీఓఓ లెస్‌ గాల్ ‌బ్రెత్‌ కోరగా, అందుకు సచిన్ సానుకూలంగా స్పందించి, వివాదాన్ని ముగించేందుకు అంగీకరించారు.

"స్పాన్సర్‌షిప్‌ ఒప్పందాన్ని గౌరవించనందుకు సచిన్‌ కు మా హృదయపూర్వక క్షమాపణలు. అత్యంత ఓపికగా ఈ వివాదాన్ని పరిష్కరించిన సచిన్‌ తీరుకు మా కృతజ్ఞతలు" అని గాల్ బ్రెత్ వ్యాఖ్యానించారు. 2016లో స్పార్టన్ కంపెనీకి సచిన్ బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేయగా, ఒప్పందం ప్రకారం రాయల్టీ, ఎండార్స్‌ మెంట్‌ ఫీజులను చెల్లించడంలో కంపెనీ విఫలమైంది. ఒప్పందం ముగిసిన తరువాత కూడా సచిన్ పేరును వాడుకుంది. దీంతో సచిన్ న్యాయపోరాటానికి దిగి రూ. 15.1 కోట్లు (సుమారు 2 మిలియన్ డాలర్లు) చెల్లించాలంటూ గత సంవత్సరం కేసు వేయడం జరిగింది. 

More Telugu News